Sanjay Raut: రాష్ట్రపతిని రాజీనామా చేయమని అడుగుతారా?: సంజయ్‌ రౌత్‌

మహారాష్ట్రలో మైసూరు మహారాజు టిప్పు సుల్తాన్‌ పేరు రాజకీయ వివాదాలకు దారితీస్తోంది. తాజాగా ముంబయిలో ఓ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లోని గార్డెన్‌కు టిప్పు సుల్తాన్‌ పేరు పెట్టడంపై భాజపా, విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువులను టిప్పు సుల్తాన్‌ హింసించినట్లు

Published : 28 Jan 2022 01:40 IST

భాజపాను ప్రశ్నించిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

ముంబయి: మహారాష్ట్రలో మైసూరు మహారాజు టిప్పు సుల్తాన్‌ పేరు రాజకీయ వివాదాలకు దారితీస్తోంది. తాజాగా ముంబయిలో ఓ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లోని గార్డెన్‌కు టిప్పు సుల్తాన్‌ పేరు పెట్టడంపై భాజపా, విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువులను టిప్పు సుల్తాన్‌ హింసించినట్లు చరిత్ర చెబుతోందని, అలాంటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడాన్ని భాజపా ఒప్పుకోదని ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భాజపా, వీహెచ్‌పీ నేతలు నిరసన చేపట్టారు. కాగా.. భాజపా తీరుపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. టిప్పు సుల్తాన్‌ గురించి తమకు తెలుసని.. భాజపా నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రపతి కూడా టిప్పు సుల్తాన్‌ను కొనియాడారని, ఆయన్ను రాజీనామా చేయమని డిమాండ్‌ చేయగలరా అని భాజపా నేతల్ని ప్రశ్నించారు.

‘‘తమకు మాత్రమే చరిత్ర తెలుసని భాజపా భావిస్తోంది. ప్రతి ఒక్కరూ చరిత్రను సృష్టించాలనుకుంటారు. కానీ, ఈ చరిత్రకారులు(భాజపా నేతలను ఉద్దేశించి) చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు టిప్పు సుల్తాన్‌ గురించి బాగా తెలుసు. భాజపా నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యముంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కర్ణాటకలో పర్యటించినప్పుడు టిప్పు సుల్తాన్‌.. చారిత్రక వీరుడని, స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. మరి రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయమని భాజపా నేతలు అడుగుతారా?’’అని ప్రశ్నించారు. ఈ విషయంలో భాజపా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు