Sanjay Raut: శిందే.. నీ ఆత్మగౌరవం ఇదేనా?

ఛత్రపతి శివాజీని తక్కువ చేసి మాట్లాడినందుకుగానూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొశ్యారీని వెంటనే తొలగించాలని శివసేనలోని ఉద్ధవ్‌ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్‌రౌత్‌ డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ వ్యాఖ్యలపై మౌనం వహించిన ముఖ్యమంత్రి కూడా ఆ పదవికి రాజీనామా చేయాలన్నారు.

Published : 21 Nov 2022 02:37 IST

ముంబయి: మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్‌సింగ్‌ కొశ్యారీని తొలగించాలని శివసేనలోని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్‌రౌత్‌ డిమాండ్‌ చేశారు. మరాఠా ప్రజల మనోభావాలు  దెబ్బతినేలా ఆయన ప్రవర్తించారని మండిపడ్డారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను ఓ ‘పాత విగ్రహం’గా అభివర్ణించిన ఆయన్ని ముఖ్యమంత్రి శిందే వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. వెంటనే సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని అన్నారు. ముంబయిలో రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి విడిపోవడానికి ‘‘ ఆత్మగౌరవమే’’ కారణమని చెప్పిన శిందే.. అదే ఉంటే ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేయాలి’’ అని సంజయ్‌ రౌత్‌ అన్నారు.

గవర్నర్‌ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని రౌత్‌ తప్పుబట్టారు. ఏడాదికి నాలుగు సార్లు శివాజీ మహరాజ్‌ను హేళన చేసినా ప్రభుత్వం మిన్నకుండిపోతోందని విమర్శించారు. ‘‘ భాజపా వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? మరాఠా ప్రజలకు భాజపా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. వెంటనే గవర్నర్‌ను రీకాల్‌ చేయాలి’’ అని సంజయ్‌రౌత్‌ డిమాండ్‌ చేశారు.

సావర్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఉద్ధవ్‌వర్గం నిరసనకు దిగిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం శిందే వర్గం కూడా గవర్నర్‌ వ్యాఖ్యలపై నిరసన చేపట్టాలని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని