Published : 28/11/2021 01:22 IST

AP News: బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకూ నిధుల్లేవు..!

గుంటూరు: 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై గుంటూరు జిల్లా సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో.. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకూ నిధులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ జనరల్‌ ఫండ్‌ను సీఎస్ఎంఎఫ్‌కు అనుసంధానం చేయడం సరికాదన్నారు. నిధుల కొరతతో.. గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నామని తెలిపారు. సొంత నిధులు ఖర్చు చేసి అప్పులపాలైన సర్పంచులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. నిధులను తమ ఖాతాల్లోకి తిరిగి జమ చేయాలని కోరారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ సానుకూల నిర్ణయం తీసుకోవాలని సర్పంచులు విజ్ఞప్తి చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వంపై పోరాడతామంటున్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకూ సిద్దమేనన్నారు. 

Read latest Political News and Telugu News


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని