TS News: అమల్లోకి ఎన్నికల కోడ్‌..  తెరాస విజయగర్జన సభ వాయిదా

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో

Updated : 09 Nov 2021 18:11 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇవాళ్టి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎలాంటి పబ్లిక్‌ మీటింగ్‌ నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఇచ్చిన మార్గదర్శకాలే ఎమ్మెల్సీ ఎన్నికలకు వర్తిస్తాయని తెలిపారు. రాజకీయ సమావేశాలకు కూడా అనుమతి లేదన్నారు. 12 స్థానాలకు డిసెంబరు 10న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ జరుగుతుందని, 14న లెక్కింపు ఉంటుందని శశాంక్‌ గోయల్‌ తెలిపారు. 500 మంది కంటే ఎక్కువ మందితో సభలు, సమావేశాలు పెట్టరాదని స్పష్టం చేశారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, స్టార్‌ క్యాంపైనర్లు ఉండరని చెప్పారు. ఎన్నికల ప్రచారం, ప్రక్రియలో ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. అందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ఎన్నికల నిర్వహణ ఉంటుందన్నారు. ఎన్నిక ల నియమావళి ఇవాళ్టి నుంచి అమల్లోకి రావడంతో ఈనెల 29న హనుమకొండలో జరగాల్సిన తెరాస విజయగర్జన సభ వాయిదా పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు