Satya kumar: ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్‌

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు.

Updated : 16 Jun 2024 14:53 IST

అమరావతి: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య కళాశాలల ఏర్పాటులో అప్పటి ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు.

‘‘గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ సరి చేస్తాం. వైద్యంలో రాష్ట్రాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతాం. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి చికిత్స, నివారణకు చర్యలు తీసుకుంటాం. వైద్యారోగ్య శాఖ సిబ్బంది సంక్షేమ, ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తాం. ఎయిమ్స్‌ తరహాలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యానికి చర్యలు తీసుకుంటాం’’ అని సత్యకుమార్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని