Satya kumar: పీఎఫ్‌ఐ.. వైకాపా రెండూ ఒకటే: భాజపా నేత సత్యకుమార్‌

వైకాపాపై భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీని నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)తో పోల్చారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యకుమార్‌ మాట్లాడారు.

Updated : 30 Sep 2022 15:26 IST

గుంటూరు: వైకాపాపై భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీని నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)తో పోల్చారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యకుమార్‌ మాట్లాడారు. పీఎఫ్‌ఐకు వైకాపాకు పెద్ద తేడాలేదని వ్యాఖ్యానించారు. ఆ సంస్థలాగే వైకాపావి కూడా విధ్వంసకర ఆలోచనలేనని మండిపడ్డారు.

సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో  ఆయనకు సగం మంది మద్దతే ఉందని.. ఈ విషయం ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) టీమ్‌ సర్వేలో తేలిందన్నారు. అలాంటిది వైకాపా 175 సీట్లు ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఎమ్మె్ల్యేలంతా గడపగడపకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. ఆయనే నియోజకవర్గంలో పర్యటించాలని హితవు పలికారు. ప్రజావ్యతిరేకతపై జగన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. గృహనిర్మాణ పథకంపై సీఎం ఎన్నిసార్లు సమీక్ష నిర్వహించినా పురోగతి లేదని సత్యకుమార్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా 10 శాతం కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించలేదని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని