ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్‌

ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.

Published : 18 Jun 2024 14:30 IST

అమరావతి: ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జులై 2 తుది గడువు కాగా.. ఉపసంహరణకు ఆ నెల 5 వరకు గడువు ఉంది. జులై 12న పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇటీవల సి. రామచంద్రయ్య, షేక్‌ ఇక్బాల్‌పై మండలి ఛైర్మన్‌ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని