Gujarat-Himachal: గుజరాత్‌, హిమాచల్‌లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు?

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నిక(Assembly election Results)ల పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. గుజరాత్‌లో భాజపా(BJP) గత రికార్డుల్ని బద్దలుకొడుతూ 155 సీట్లతో క్లీన్‌స్వీప్‌ చేయగా.. గత సంప్రదాయాన్ని పాటిస్తూ హిమాచల్‌ప్రదేశ్‌ ఈసారి కాంగ్రెస్‌(Congress) ‘చేతి’కి చిక్కింది.

Updated : 08 Dec 2022 22:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నిక(Assembly election Results)ల పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. గుజరాత్‌లో భాజపా(BJP) గత రికార్డుల్ని బద్దలుకొడుతూ 155 సీట్లతో క్లీన్‌ స్వీప్‌ చేయగా.. గత సంప్రదాయాన్ని పాటిస్తూ హిమాచల్‌ప్రదేశ్‌ ఈసారి కాంగ్రెస్‌(Congress) ‘చేతి’కి చిక్కింది. ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ రెండు రాష్ట్రాల్లో అరంగేట్రం చేసిన ఆప్‌ గుజరాత్‌లో ఐదు సీట్లు, భారీగా ఓట్లు సాధించి జాతీయ పార్టీ హోదాను దక్కించుకోగా.. హిమాచల్‌లో మాత్రం ఆ పార్టీ అంత ఆశాజనకమైన పనితీరును కనబరచలేకపోయింది. ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏ పార్టీకి ఎన్ని ఓట్లు, ఎన్నెన్ని సీట్లు వచ్చాయో పరిశీలిస్తే..

గుజరాత్‌లో భాజపా సూపర్‌ విక్టరీ@156

గుజరాత్‌లో 37 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసిన భాజపా 156 సీట్లు సాధించి మరోసారి ప్రభంజనం సృష్టించింది. మోదీ-షా ద్వయం వ్యూహాలకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ వెలవెలబోయి కేవలం 17 స్థానాలకే పరిమితమైపోయింది. భాజపాకు తామే ప్రయత్నామ్నాయంటూ ప్రచారంలో దూసుకెళ్లిన ఆప్‌ ఐదు సీట్లుగెలుచుకొంది. అలాగే, స్వతంత్రులు మూడు స్థానాలు గెలుచుకోగా.. సమాజ్‌వాదీ పార్టీ ఒకస్థానంలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భాజపాకు 1,67,07,957 ఓట్లు (52.50శాతం) ఓట్లు రాగా.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు 86,83,966 ఓట్లు (27.3శాతం) ఓట్లు వచ్చాయి. ఆప్‌ 41,12,055 ఓట్లు (12.9శాతం) సాధించి ఐదు సీట్లు గెలుచుకోగా.. ఇతరులు 13,81,739 ఓట్లు (4.34శాతం) సాధించారు. గుజరాత్‌లో నోటాకు 5,01,202 (1.6శాతం ) ఓట్లు , సమాజ్‌వాదీ పార్టీకి 92,215 ఓట్లు (0.3శాతం ఓట్లు సాధించి ఒకస్థానం గెలుచుకోగా.. బీఎస్పీ 1,58,123 (0.50శాతం) ఓట్లు సాధించింది. 

హిమాచల్‌లో ఓట్ల తేడా స్వల్పమే.. కానీ తీర్పు మారిపోయింది!

హిమాచల్‌ ప్రదేశ్‌లో నువ్వానేనా అన్నట్టుగా సాగిన పోరులో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి మొత్తంగా 18,52,504 ఓట్లు (43.9శాతం)తో 40 స్థానాలు రాగా.. భాజపా 18,14,530 ఓట్లు(43శాతం) సాధించినా 25 స్థానాలతో ఈసారి ప్రతిపక్షానికే పరిమితమైంది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్లు తేడా కేవలం 37,974 ఓట్లే కావడం గమనార్హం. ఇకపోతే, ఆప్‌కు 46,270 (1.10శాతం) ఓట్లు రాగా.. ఇతరులకు 4,38,413 (10.39శాతం) ఓట్లు, 3 సీట్లు వచ్చాయి. హిమాచల్‌లో నోటాకు 24,861 (0.59శాతం) ఓట్లు పడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు