Published : 25 Jun 2022 13:48 IST

Eknath Shinde: మా కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే.. ఠాక్రే, పవార్‌దే బాధ్యత

ముంబయి: తనతో సహా 16 మంది ఎమ్మెల్యేల నివాసాల వద్ద కల్పించిన భద్రతను మహారాష్ట్ర(Maharashtra) ప్రభుత్వం ఉపసంహరించుకుందని శనివారం అసమ్మతి నేత ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde) ఆరోపించారు. ఇది రాజకీయ ప్రతీకారం అంటూ విమర్శించారు. శివసేన(Shiv Sena) అసమ్మతి వర్గానికి నేతృత్వం వహిస్తోన్న శిందే ప్రస్తుతం గువాహటిలో ఉన్నారు. ఈ క్రమంలో భద్రతను ఉపసంహరించుకున్నారంటూ 16 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను ట్విటర్‌లో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్ర హోం మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌కు దానిని పంపారు.

‘ఇదంతా రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడమే. ముఖ్యమంత్రి, హోం మంత్రి ఆదేశాల మేరకే ఈ భద్రతను ఉపసంహరించుకున్నారు. మా రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. తిరిగి మా భద్రతను పునరుద్ధరించాలి. మా కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే.. ముఖ్యమంత్రి, మహా వికాస్ అఘాడీలోని నేతలైన శరద్ పవార్, సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేల నివాసం వద్ద, కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలి. ప్రతికారంతో దానిని ఉపసంహరించుకున్నారు’ అని ఆ ట్వీట్‌లో ఆరోపించారు. 

దీనిపై సంజయ్ రౌత్ స్పందించారు. ‘మీరు ఎమ్మెల్యే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు భద్రత కల్పిస్తుంది. అదే తరహాలో మీ కుటుంబ సభ్యులకు అందించడం సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు. హోం మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్ ఈ ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. ‘ఈ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల భద్రతను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి కానీ, హోం శాఖ కానీ ఆదేశాలు ఇవ్వలేదు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి’ అంటూ ఖండించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని