TS High court: రేవంత్‌రెడ్డి పాదయాత్రకు భద్రత పెంపు.. హైకోర్టుకు తెలిపిన అదనపు డీజీ

తెలంగాణలో కాంగ్రెస్‌ చేపట్టిన ‘హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌’పాదయాత్ర నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి భద్రత పెంచుతున్నట్టు పోలీసుశాఖ హైకోర్టుకు తెలిపింది.

Published : 03 Mar 2023 16:33 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ చేపట్టిన ‘హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌’ పాదయాత్రకు భద్రత పెంచాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రేవంత్‌ పాదయాత్రకు తగిన భద్రత ఇస్తున్నామని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రేవంత్‌ పాదయాత్రకు భద్రత ఇవ్వాలని అదనపు డీజీ ఎస్పీలకు లేఖ పంపారని కోర్టుకు దృష్టికి తెచ్చారు. అదనపు డీజీ రాసిన లేఖను జీపీ హైకోర్టుకు సమర్పించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పాదయాత్రకు భద్రత కల్పిస్తే విచారణ కొనసాగించాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్న భద్రత ఉందో? లేదో? సోమవారం కోర్టుకు తెలపాలని రేవంత్‌ తరఫు న్యాయవాదికి సూచిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని