Assembly Elections 2022: ‘మేం మాట మీద నిలబడతాం’: ఉత్పల్ కోసం పోటీ వద్దనుకున్న శివసేన
గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పాల్కు భాజపా టికెట్ నిరాకరించగా.. శివసేన మద్దతు ప్రకటించింది.
పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్‌కు భాజపా టికెట్ నిరాకరించగా.. శివసేన మద్దతు ప్రకటించింది. ఆయన పోటీచేస్తున్న పనాజీ నియోజకవర్గంలో పోటీ నుంచి విరమించుకుంది. తమ పార్టీ తరఫున అక్కడ నిలబడిన అభ్యర్థిని తప్పించింది. ఈ ఎన్నికల్లో పనాజీ నుంచి పోటీ చేయాలని భావించిన ఉత్పల్‌కు భాజపా టికెట్ దక్కలేదు. దాంతో అసంతృప్తికి గురైన ఆయన కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ స్థానం నుంచి స్వతంత్రంగా బరిలో నిలిచారు.
ఉత్పల్‌కు పనాజీ నుంచి భాజపా టికెట్ ఇవ్వకపోతే.. విపక్షాలన్నీ ఆయనకు అండగా నిలవాలని ఇదివరకే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విజ్ఞప్తి చేశారు. చెప్పినట్టుగానే శివసేన పోటీ నుంచి తప్పుకుంది. ‘మేం మాట మీద నిలబడతాం. మా పార్టీ తరఫున నిలబడ్డ శైలేంద్ర అభర్థిత్వాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. అదొక్కటే కాదు.. మా కార్యకర్తలు ఉత్పల్‌కు పూర్తి మద్దతు ఇస్తారు. ఇది కేవలం ఎన్నికల కోసమే కాదు. గోవా రాజకీయాల ప్రక్షాళన కోసం కూడా’ అంటూ రౌత్ ట్వీట్ చేశారు. అలాగే మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేను ట్యాగ్ చేశారు. అలాగే దివంగత మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించిన స్థానంలో ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తారా..?’ అంటూ భాజపాను ప్రశ్నించారు.
మనోహర్ పారికర్ మూడుసార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనారోగ్యం కారణంగా 2019లో మరణించారు. 25 సంవత్సరాల పాటు ఆయన పనాజీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. పారికర్ మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన దీర్ఘకాల ప్రత్యర్థి అటనాసియో మాన్సెరేటె కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. అనంతరం భాజపాలో చేరారు. ఆయన అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈసారి ఆ స్థానం నుంచి తాను నిలబడతానని ఉత్పల్ భాజపా అధిష్ఠానాన్ని కోరినప్పటికీ.. కమలం పార్టీ అటనాసియో వైపే మొగ్గుచూపింది. దానికి బదులు వేరే స్థానం నుంచి టికెట్ ఇస్తానని వెల్లడించింది. అందుకు అంగీకరించని ఉత్పల్ భాజపాను వీడారు. ఇప్పటికే ఆయనకు ఆప్ నుంచి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను జైపుర్‌లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
భారతదేశపు సంపన్న మహిళ సావిత్రి జిందాల్ (Savitri Jindal), బిజేడీ నుంచి 6 సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి భాజపాలో చేరారు. -
కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరనున్నారు. -
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. -
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్‌లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది. -
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్‌సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్‌కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్‌లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు