ఆమె ‘నిజమైన బెంగాల్‌ టైగర్’: శివసేన 

పశ్చిమబెంగాల్‌లో రాబోయే ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీకి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు శివసేన పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా ఆమెను ‘రియల్‌ బెంగాల్‌ టైగర్‌’గా శివసేన అభివర్ణించింది. ఈ మేరకు శివసేన నేత సంజయ్‌రౌత్‌ గురువారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.  

Published : 04 Mar 2021 16:15 IST

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లో రాబోయే ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీకి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు శివసేన పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా ఆమెను ‘రియల్‌ బెంగాల్‌ టైగర్‌’గా శివసేన అభివర్ణించింది. ఈ మేరకు శివసేన నేత సంజయ్‌రౌత్‌ గురువారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.  

‘పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందా లేదా అనే విషయంపై చాలా మంది ఆతృతగా ఉన్నారు. ఆ విషయంపై పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఆధ్వర్యంలో చర్చలు జరిపాం. కానీ అక్కడ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అందరూ ఒకవైపు.. దీదీ ఒకవైపు అన్నట్లు ఉంది. దీదీని ఓడించడానికి డబ్బు, కండ బలం, మీడియా బలం అన్నింటినీ ఉపయోగిస్తున్నారు. దీంతో బెంగాల్‌ ఎన్నికల్లో శివసేన దీదీకి మద్దతుగా ఉండాలని నిర్ణయించింది. మమతాయే నిజమైన బెంగాల్‌ టైగర్‌.. కాబట్టి ఆమె విజయం సాధిస్తారని మేం ఆశిస్తున్నాం’ అని రౌత్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో శివసేన ఎన్డీయే కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల అనంతరం ఆ పార్టీ ఎన్డీయే నుంచి వైదొలగింది. అప్పటినుంచి భాజపాకు వ్యతిరేక విధానాల్ని ఆ పార్టీ అనుసరిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బెంగాల్‌ ఎన్నికల్లో దీదీకి మద్దతు ఇవ్వడం గమనార్హం. కాగా, బెంగాల్‌ ఇప్పటికే భాజపా, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని