Shabbir Ali: కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల్ని గతంలో భారాసలో చేర్చుకోలేదా?: షబ్బీర్‌ అలీ

ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడాన్ని భారాస నేతలు తప్పుపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ విమర్శించారు.

Published : 24 Jun 2024 14:57 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడాన్ని భారాస నేతలు తప్పుపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఆక్షేపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గతంలో భారాస చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. శాసనసభలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది మీరు కాదా? అని నిలదీశారు. శాసనమండలిలో తనకు ప్రతిపక్ష నేత హోదా తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

‘‘భారాస పార్టీ కార్యాలయం కోసం 11 ఎకరాలు ఎందుకు? కార్యాలయం ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకోవాలి. కోకాపేటలో భారాసకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకొని వేలం వేయాలి. వేలం వేసిన డబ్బులు రుణమాఫీకి ఉపయోగించాలి. భారాస ఖతం అయ్యింది’’ అని షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని