
పెనుబల్లిలో షర్మిల నిరుద్యోగ దీక్ష
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. వాళ్ల కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్న షర్మిల అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. వాళ్ల కష్టాలు విన్న ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
అనంతరం పెనుబల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు. ముందుగా వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత దీక్షలో కూర్చున్నారు. తెలంగాణలోని నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టాలనే నిర్ణయంలో భాగంగా షర్మిల నిరసనకు దిగారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.