Shashi Tharoor: అందుకే విపక్షాలు ఆందోళన చేయాల్సి వస్తోంది: శశి థరూర్‌

పార్లమెంట్‌ సమావేశాల్లో విపక్షాలు ఆందోళనలు చేసి తమ స్థాయిని దిగజార్చుకుంటున్నాయని, ఆందోళన వల్ల ప్రజా సమస్యలను చర్చించే అవకాశం లేకుండాపోతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీకే చెందిన శశి థరూర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురుచేస్తోంది. అయితే, తన

Updated : 23 Dec 2021 11:45 IST

దిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల్లో విపక్షాలు ఆందోళనలు చేసి తమ స్థాయిని దిగజార్చుకుంటున్నాయని, ఆందోళన వల్ల ప్రజా సమస్యలను చర్చించే అవకాశం లేకుండాపోతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీకే చెందిన శశిథరూర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురుచేస్తోంది. అయితే, తన అభిప్రాయం కాంగ్రెస్‌ పార్టీకి తెలుసని ఆయన అన్నారు. పార్లమెంట్‌ను ప్రజాసమస్యలపై చర్చించడానికి వినియోగించాలే కానీ.. ర్యాలీలు, ఆందోళన చేయడానికి కాదని హితువు పలికారు. పార్లమెంట్‌ సమావేశాలను భంగపర్చకూడదన్నారు. అయితే, సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడం వల్లే అప్పుడప్పుడు విపక్షాలు ఆందోళన చేయాల్సి వస్తోందని చెప్పారు. 

శీతాకాల సమావేశాలు నిర్దేశించిన తేదీకంటే ఒక రోజు ముందుగానే ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు జరిగిన తీరుపై శశి థరూర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలు మరికొన్ని రోజులు జరగాలని, పార్లమెంట్‌ నిర్వహణ విధానాల్లో సంస్కరణలు చేపట్టాలని సూచించారు. ‘‘అనేక పాశ్చాత్య దేశాలు విపక్ష ఎంపీలకు సమస్యలపై గళం విప్పేందుకు ఒక రోజును కేటాయిస్తున్నాయి. ఆ పని మనం చేయట్లేదు. ప్రభుత్వంమే అజెండాను రూపొందిస్తోంది. దీంతో విపక్షాలు నిరాశకు గురవుతున్నాయి. సమస్యలను లేవనెత్తే అవకాశం దక్కకపోవడంతో ఆందోళన బాట పడుతున్నాయి. సమావేశాల సమయంలో రోజుకు అరగంట విపక్షాలకు కేటాయిస్తే ఎంపీలు తమ సమస్యలను వివరిస్తారు. అలాంటి సంస్కరణను మనం తీసుకురాలేకపోతున్నాం? ఎందుకంటే ఒకరి చెప్పుచేతల్లో ఉండే వ్యక్తులు ఈ సంస్కరణలను ఇష్టపడరు’’అని శశి థరూర్‌ అన్నారు. 

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని