Andhra News: మంత్రి వేణుగోపాలకృష్ణ మా పరువు తీశారు: శెట్టిబలిజ సంఘం ఆగ్రహం

శెట్టి బలిజ జాతి జగన్‌కు రుణపడి ఉంటుందంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇటీవల తితిదే ఛైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డి కాళ్ల వద్ద మోకరిల్లడంపైశెట్టి బలిజ జాతి జగన్‌కు రుణపడి ఉంటుందంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇటీవల తితిదే ఛైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డి కాళ్ల వద్ద మోకరిల్లడంపై శెట్టిబలిజ సంఘం నాయకులు

Published : 03 May 2022 01:38 IST

పి.గన్నవరం: శెట్టి బలిజ జాతి జగన్‌కు రుణపడి ఉంటుందంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇటీవల తితిదే ఛైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డి కాళ్ల వద్ద మోకరిల్లడంపై శెట్టిబలిజ సంఘం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కోనసీమజిల్లా పి.గన్నవరంలో ఆ సంఘం నాయకులు సమావేశమై మంత్రి తీరును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గన్నవరంలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. శెట్టిబలిజ జాతికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రి హోదాలో ఉన్న వేణుగోపాలకృష్ణ తమ కులాన్ని కించపర్చే విధంగా వ్యవహరించి పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి తీరుపై శెట్టిబలిజలు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే మంత్రి క్షమాపణలు చెప్పకపోతే రాబోయే రోజుల్లో శెట్టిబలిజ జాతి తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.

‘మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కుటుంబానికి ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక సాయం అందించడానికి కారకులైన తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిలకు ఎన్ని జన్మలైనా శెట్టిబలిజలుగా శిరస్సు వంచి నమస్కరిస్తా’ అంటూ రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించారు. కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఎ.వేమవరంలో గత శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైవీ సుబ్బారెడ్డి వేదికపై కూర్చోగా మంత్రి వేణు ఆయన ముందు మోకరిల్లిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని