Shivsena: యూపీ, గోవాలో శివసేన పోటీ.. సంజయ్‌ రౌత్‌ వెల్లడి

వచ్చే ఏడాది యూపీ, గోవా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు.

Published : 13 Sep 2021 01:25 IST

మంబయి: వచ్చే ఏడాది యూపీ, గోవా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. యూపీలో తమ పార్టీకి కొన్ని రైతు సంఘాలు మద్దతిస్తాయని పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 80 నుంచి 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు రౌత్‌ చెప్పారు. గోవాలో 20 సీట్లలో అభ్యర్థులను నిలబెడతామన్నారు. ఉత్తర యూపీలో కొన్ని రైతు సంఘాలు తమకు మద్దతిస్తాయని చెప్పారు. మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని వివరించారు. గోవాలో మహా వికాస్‌ అఘాడీ తరహా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా విజయ్‌ రూపాణీ రాజీనామా గురించి విలేకరులతో ప్రశ్నించగా.. అది భాజపా అంతర్గత విషయమని రౌత్‌ చెప్పారు. బయటి వ్యక్తుల జోక్యం సరికాదన్నారు. అయితే, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించడం భాజపాకు ఈ సారి అంత సులువేమీ కాదని అన్నారు. జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు కావాల్సిన సామర్థ్యం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఉందని మరో ప్రశ్నకు సంజయ్‌ రౌత్‌ సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని