Updated : 27 Dec 2020 13:03 IST

భాజపా వ్యతిరేక పార్టీలు ఏకం కావాలి: శివసేన

ముంబయి: భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కటై యూపీఏ కూటమి ద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా మారాలని శివసేన పార్టీ సూచించింది. అంతేకాకుండా దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తమ నాయకత్వానికి సంబంధించి, యూపీఏ కూటమి భవిష్యత్తు గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచనలు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ తన అధికార పత్రిక సామ్నా వేదికగా అభిప్రాయపడింది. 

‘కేంద్రంలో అధికారంలో ఉన్నవారు రైతుల ఆందోళనల పట్ల పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఆ వైఖరికి.. సరైన ప్రతిపక్షం లేకపోవడమే కారణం. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌.. తమ నాయకత్వంపై ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పటికీ యూపీఏ కూటమిలోని వారు రైతుల ఆందోళనలను సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అని సామ్నా పేర్కొంది.

‘దేశంలో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, శివసేన, అకాలీదళ్‌, బీఎస్పీ, ఎస్పీ, వైఎస్‌ఆర్సీపీ, టీఆర్‌ఎస్‌, బీజేడీ, జేడీఎస్‌ పార్టీలన్నీ భాజపాకు వ్యతిరేకమే. కానీ వారంతా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో భాగం కాదు. ఈ పార్టీలన్నీ ఒక గొడుగు కిందకు వస్తే తప్ప కేంద్రంలో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయలేం. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులైనటువంటి అహ్మద్‌పటేల్‌, మోతీలాల్‌వోరా ఇక లేరు. దీంతో కాంగ్రెస్‌ను ఎవరు నడిపిస్తారనే అంశంపైనా ప్రస్తుతం స్పష్టత లేదు. యూపీఏ కూటమిపై భవిష్యత్తు ఏంటో తెలియడం లేదు. ఈ అంశాలపై కాంగ్రెస్‌ సీరియస్‌గా ఆలోచించకపోతే.. ప్రతిఒక్కరి భవిష్యత్తు గందరగోళం అవుతుంది’ అని సామ్నా కాంగ్రెస్‌ పార్టీకి సూచనలు చేసింది.

ఇదీ చదవండి

ఈ రిటైర్డ్‌ ఉద్యోగి ఇప్పుడు మెడిసిన్‌ విద్యార్థి
 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని