UP Politics: పొత్తా.. విలీనమా? వారం రోజుల్లో చెప్పండి..
వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్ శివపాల్ యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ....
అబ్బాయ్‌కి బాబాయ్ అల్టిమేటం!
లఖ్‌నవూ: వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్ శివపాల్ యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ లోహియా (పీఎస్‌పీఎల్) అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కూడా సై అని గతంలోనే స్పష్టంచేశారు. అయితే, ఈ రెండు పార్టీల మధ్య పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ శివపాల్ యాదవ్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో, విలీనం చేసుకుంటారో వారం రోజుల్లో నిర్ణయం వెల్లడించాలని అఖిలేశ్ యాదవ్‌కు అల్టిమేటం జారీచేశారు. మంగళవారం శివపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... సమాజ్‌వాదీ పార్టీతో విలీనానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. వారం రోజుల్లో ఇది జరగకపోతే.. లఖ్‌నవూలో తాము కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామని, తమవారితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు.
సమయం మించిపోతోంది.. త్వరగా నిర్ణయం తీసుకోండి
సోమవారం రాత్రి శివపాల్ యాదవ్ తన సోదరుడు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌తో లఖ్‌నవూలో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయనతో చర్చించారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే తమ ప్రాధాన్యమని వెల్లడించారు. ములాయం జన్మదిన వేడుకల రోజున పొత్తు పెట్టుకుంటారని రాష్ట్రమంతా భావిస్తోందని పేర్కొన్నారు. ఏదేమైనా ఈ ప్రక్రియ వేగంగా జరగాలని కోరారు. ములాయం సింగ్ తమకు కుస్తీయే కాదు.. రాజకీయ తంత్రాలూ నేర్పారన్నారు. ఐక్యతతోనే బలం అని అన్నారు. కుటుంబంలో విభజనలు.. అనేక లోటుపాట్లు తీసుకొస్తాయన్నారు. తమ మద్దతుదారుల కోసం 100 సీట్లు ఇవ్వాలన్న శివపాల్ యాదవ్.. దాన్నుంచి తాము వెనక్కి తగ్గుతున్నట్టు తెలిపారు. రెండేళ్లుగా ఇదే విషయం చెబుతున్నా ఇంకా నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. తమ పొత్తులో గెలిచే పరిస్థితి ఉన్నవారికే సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్లు ఇవ్వాలన్నారు. తాము సమాజ్‌వాదీతో విలీనానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంచేశారు. సమయం మించిపోతుందని, త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్‌రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్‌ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి కాదా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్‌పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్‌పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్‌సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు