Siddaramaiah: అధిష్ఠానం మొగ్గు సిద్ధరామయ్య వైపే.. నేడు ప్రకటన వెలువడే అవకాశం!
కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధూవైపే మొగ్గుచూపినట్లు సమాచారం.
దిల్లీ: కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రి (Chief Minister)పై గత కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడినట్లు తెలుస్తోంది. ముందుగా ఊహించినట్లుగానే సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) వైపే కాంగ్రెస్ (Congress) అధిష్ఠానం మొగ్గు చూపినట్లు సమాచారం. సుదీర్ఘ మంతనాల తర్వాత.. సీఎం పగ్గాలను సిద్ధూకే అప్పగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పార్టీ దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈ సాయంత్రం ప్రకటన చేసే అవకాశముంది. గురువారం ఆయన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
డీకేకు డిప్యూటీ సీఎం బాధ్యతలు..?
ఈ ఉదయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో సిద్ధరామయ్య మరోసారి భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు చర్చించిన తర్వాత 10 జన్‌పథ్ నుంచి సిద్ధూ వెళ్లిపోయారు. అనంతరం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar)తోనూ రాహుల్ సమావేశమయ్యారు. పార్టీ వ్యూహాలపై ఆయన డీకేతో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేలా డీకేను రాహుల్ ఒప్పిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలను కూడా శివకుమార్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.
రేపు ప్రమాణస్వీకారం..
అన్ని అనుకున్నట్లు జరిగితే.. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah) మే 18వ తేదీన (గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారులు ప్రొటోకాల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు సిద్ధూ ఇంటి వద్ద కూడా భద్రతను పెంచారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: రష్యాలో ఐఫోన్లపై అమెరికా ‘హ్యాకింగ్’..!
-
General News
CM Jagan: రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం జగన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
YS bhaskar reddy: భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
World News
26/11 Attack: భారత్‌కు అప్పగింత నిర్ణయాన్ని సవాల్ చేసిన 26/11 దాడుల నిందితుడు తహవూర్ రాణా
-
Movies News
Project K: ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ రికార్డులు ‘ప్రాజెక్ట్-కె’ బ్రేక్ చేస్తుంది: రానా