Published : 03/11/2021 01:44 IST

Sidhu: విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు ఎన్నికల కోసమే: సిద్ధూ

అమృత్‌సర్‌: పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూకు పార్టీలోని కొందరు వ్యక్తులతో ఇంకా విబేధాలు కొనసాగుతున్నాయి. తాజాగా అధికారంలో ఉన్న సొంత పార్టీ, ముఖ్యమంత్రిపైనే ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలను యూనిట్‌కు రూ.3 చొప్పున తగ్గిస్తున్నట్లు సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు ఎన్నికల ముందు తాయిలం వంటిదేనని సిద్ధూ వ్యాఖ్యానించారు. ‘‘ఎన్నికలకు రెండు నెలల ముందు తాయిలాలు ఇస్తున్నారు. కానీ.. వాటికి ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు?అబద్ధాలు చెప్పి, బూటకపు హామీలు ఇచ్చి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారా? రాష్ట్రానికి రూ. 5లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ అప్పును ప్రభుత్వమే భరిస్తుందని ప్రజలు అనుకుంటే పొరపాటే. ఆ అప్పు భారమంతా తిరిగి ప్రజల మీదే పడుతుంది’’అని చెప్పారు. పంజాబ్‌ రాష్ట్ర సంక్షేమానికి పాటుపడే వ్యక్తులకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు కావాల్సింది తాయిలాలు కాదని.. అభివృద్ధి అని సిద్ధూ తెలిపారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని