Smriti Irnai: మంత్రి మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ!
స్మృతి ఇరానీ (Smriti Irani) కనిపించడంలేదంటూ కాంగ్రెస్ (Congress) పార్టీ చేసిన ట్వీట్‌కు ఆమె ఘాటుగా బదులిచ్చారు. అమేఠీ నియోజకవర్గం నుంచి తాను ఎక్కడికీ పారిపోలేదని కౌంటర్ ట్వీట్ చేశారు.
అమేఠీ: తాను కనిపించడం లేదంటూ కాంగ్రెస్ (Congress) పార్టీ చేసిన ట్వీట్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమేఠీ నియోజకవర్గం నుంచి తాను ఎక్కడికీ పారిపోలేదని కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ, మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ఫొటో ట్వీట్ చేసింది. దీనిపై ఘాటుగా స్పందించిన స్మృతి.. ‘‘ ఓ పవిత్ర రాజకీయ ప్రాణి.. నేను ఇప్పుడే అమేఠి లోక్‌సభ నిజయోకవర్గంలోని సాలోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సిర్‌సిరా అనే గ్రామం నుంచి ధురాన్‌పూర్ బయల్దేరా. ఒకవేళ మీరు అమేఠీ మాజీ ఎంపీ (రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) గురించి వెతుకుతుంటే మాత్రం అమెరికాను సంప్రదించండి’’ అంటూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తనను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌కు ప్రతిగా స్పందించిన స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ గెలుపొందారు. గత వారం రాహుల్ గాంధీపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇంకా వయనాడ్ ఎంపీగా ఉంటే గతంలో అమేఠీ ప్రజల దుస్థితే అక్కడా ఉండేదని స్మృతి విమర్శించారు. రాహుల్ అమేఠీ ఎంపీగా ఉన్నంతకాలం నియోజకవర్గంలో 80 శాతం మంది ప్రజలు విద్యుత్, వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్నారని ఆరోపించారు. ఆయన అమేఠీ నుంచి వెళ్లిపోగానే నియోజకవర్గ ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలూ అందుతున్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా