Smriti Irani: భాజపా గుళ్లు నిర్మిస్తుంటే.. ఆప్‌ మద్యం దుకాణాలు తెరుస్తోంది: స్మృతి ఇరానీ

దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌).. పంజాబ్‌, గోవాలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో భాజపా, ఆప్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఆప్‌ కన్వినర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై విమర్శలు

Published : 05 Feb 2022 02:21 IST

దిల్లీ: దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌).. పంజాబ్‌, గోవాలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో భాజపా, ఆప్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఆప్‌ కన్వినర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. భాజపా గుళ్లు నిర్మిస్తుంటే.. ఆప్‌ ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరుస్తోందని ధ్వజమెత్తారు. 

‘‘దిల్లీలోని తిలక్‌ నగర్‌లో రెండు గురుద్వారాల మధ్య మద్యం దుకాణం కనిపిస్తోంది. ప్రతి మతానికి కొన్ని ధర్మాలుంటాయి. వాటిని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. లాభాల కోసం కేజ్రీవాల్‌ ఎంతకైనా తెగిస్తారని మరోసారి నిరూపితమైంది. ఓ వైపు దేశ రాజధానిలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తూ పంజాబ్‌ను ‘మత్తు రహిత’ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానంటూ హామీలిస్తున్నారు’’అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నైపుణ్య యువత కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తుంటే.. ఆప్‌ ప్రభుత్వం మద్యం విధానాలను రూపొందిస్తోందని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని దిల్లీలో అమలు చేస్తానని చెప్పి కేజ్రీవాల్‌ మాట తప్పారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని