‘ఆ పార్టీల వల్ల కుటుంబాలే బాగుపడతాయి’

భాజపా మినహా దేశంలో చాలా వరకు కుటుంబ ఆధారిత రాజకీయ పార్టీలే ఉన్నాయని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అలాంటి పార్టీల వల్ల కేవలం ఆయా కుటుంబాలు మాత్రమే బాగుపడతాయని.. పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు.

Published : 18 Oct 2020 02:49 IST

దిల్లీ: భాజపా మినహా దేశంలో చాలా వరకు కుటుంబ ఆధారిత రాజకీయ పార్టీలే ఉన్నాయని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అలాంటి పార్టీల వల్ల కేవలం వారి కుటుంబాలు మాత్రమే బాగుపడతాయని.. పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో భాజపా కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఎప్పుడైనా సరే ఒక పార్టీ కార్యాలయం నాయకుడి ఇంటి నుంచి నడుస్తుందంటే.. ఆ పార్టీ కేవలం ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించినది అవుతుంది. ఇలాంటివి మనం ఇతర పార్టీల్లో చూస్తుంటాం. ఆ పార్టీల్లో వారి కుటుంబసభ్యులే కీలక పాత్ర పోషిస్తుంటారు. కానీ భాజపా విషయానికొస్తే పార్టీయే మన కుటుంబం. ఇక్కడ కార్యకర్తలు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాంగ్రెస్‌ సహా ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ నాయకుడి కుమారులు, సోదరులు, తల్లులను రక్షించుకోవడం కోసమే పనిచేస్తుంటాయి. భాజపా ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ. పార్టీ కార్యకర్తలే కుటుంబంగా పనిచేస్తుంది’ అని నడ్డా పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని