దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు: మోదీ

దేశంలోని టీ పరిశ్రమను భంగపరచడం ద్వారా.. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు విదేశాల నుంచి కుట్రలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు మోదీ ఆదివారం అసోంలోని సొంటిపూర్‌ జిల్లాలో నిర్వహించిన టీ కార్మికుల సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ ఆ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం రూ.8వేల కోట్లతో తలపెట్టిన ‘అసోం మాల’ పథకానికి శంకుస్థాపన చేశారు. 

Updated : 07 Feb 2021 17:15 IST

దిల్లీ: దేశంలోని టీ పరిశ్రమపై అసత్య ప్రచారం చేసి.. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు విదేశాల నుంచి కుట్రలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అలాంటి కుట్రలు చేస్తున్న వారికి దేశీయంగా మద్దతు పలికే రాజకీయ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోదీ ఆదివారం అసోంలోని సొంటిపూర్‌ జిల్లాలో నిర్వహించిన టీ కార్మికుల సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ ఆ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం రూ.8వేల కోట్లతో తలపెట్టిన ‘అసోం మాల’ పథకానికి శంకుస్థాపన చేశారు.

‘ప్రస్తుత రోజుల్లో దేశంలోని టీ పరిశ్రమకు వ్యతిరేకంగా బయటి దేశాల నుంచి కొందరు కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల ద్వారా దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఇటీవల కొన్ని నివేదికలు బయటపెట్టాయి. ఆ కుట్రదారులకు మద్దతు పలుకుతున్న రాజకీయ పార్టీలను ప్రతి టీ తోట కార్మికుడు నిలదీయాలి. అలాంటి వారికి టీ కార్మికులంతా దీటైన జవాబు ఇస్తారని నేను భావిస్తున్నా’ అని మోదీ వెల్లడించారు. 

‘‘స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రతి రాష్ట్రంలో కనీసం ఓ వైద్యశాల, ఓ సాంకేతిక కళాశాల నెలకొల్పాలనేది నా కల. వైద్యులు మాతృభాషలో ప్రజలకు దగ్గరైనప్పుడే వారి ఇబ్బందులు అర్థం చేసుకోగలుగుతారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య సేవలు మెరుగవుతాయి. అసోంలో గత ఐదేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి జరిగింది. వైద్యారోగ్య, మౌలిక సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇప్పుడు ప్రారంభించిన ‘అసోం మాల’ పథకం ద్వారా ప్రజలకు ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయి’’ అని మోదీ తెలిపారు. 

ఇదీ చదవండి

ఉప్పొంగిన ధౌలిగంగా నది



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని