Somireddy: జగన్‌ వ్యాఖ్యలపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైర్‌

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్‌ డిజిట్‌ వస్తుందని వైకాపా నేతల సమావేశంలో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.

Published : 21 Jun 2024 19:39 IST

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్‌ డిజిట్‌ వస్తుందని వైకాపా నేతల సమావేశంలో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. గడిచిన ఐదేళ్లలో జగన్‌ రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, దీన్ని సహించలేక ప్రజలు తగిన తీర్పు ఇచ్చారన్నారు. జగన్‌ చేసిన అరాచక పాలనకు ఫలితాన్ని త్వరలో అనుభవించి తీరుతారన్నారు. అక్రమాస్తుల కేసు విచారణలో కోర్టు మెట్లెక్కేందుకు ఆయన సిద్ధంగా ఉండాలన్నారు. లిక్కర్‌లోనే రూ.లక్షల కోట్లు దోపిడీ చేశారని, ల్యాండ్‌, మైనింగ్‌ మాఫియాతో వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు.

సర్వేపల్లిలోనే దాదాపు వెయ్యి ఎకరాల భూమి కాజేశారన్నారు. రాష్ట్రాన్ని ప్రైవేటు ఎస్టేట్‌లా మార్చుకోవాలని చూశారని, దీనికోసం గడిచిన ఐదేళ్లలో జగన్ రాష్ట్రానికి చాలా నష్టం చేశారని సోమిరెడ్డి అన్నారు. దుర్మార్గాలు చేసిన వారిని ఎన్నికల్లో  ప్రజలు సంహరించారని చెప్పారు. జగన్ వైఫల్యం వల్లే అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని బాధ్యతగా పాలిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని