అచ్చెన్న ఇంకా రిమాండ్‌లో ఉండటం బాధిస్తోంది

ఏ తప్పూ చేయని మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు ఇంకా రిమాండ్‌లో ఉండటం బాధిస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు...

Published : 07 Aug 2020 10:23 IST

సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

విజయవాడ: ఏ తప్పూ చేయని మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు ఇంకా రిమాండ్‌లో ఉండటం బాధిస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. అచ్చెన్న కుటుంబం దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉందని గుర్తుచేశారు. మంత్రిగా అచ్చెన్న తీసుకున్న నిర్ణయాల్లో పట్టుమని రూ.10లక్షల అవినీతి చూపలేకపోయినా.. కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపులకు ఓ పరిధి, పరిమితి ఉంటుందన్నారు. అచ్చెన్న నిర్దోషిగా బయటకు వస్తారని సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో... ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని