TDP: ఇసుకను అమ్ముకుంటానని జగన్ మేనిఫెస్టోలో చెప్పారా?: సోమిరెడ్డి

మహానాడు వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు తొలివిడత మేనిఫెస్టో ప్రకటించినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్‌ సహా వైకాపా మంత్రులకు నిద్రపట్టడం లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Published : 31 May 2023 19:37 IST

గుంటూరు: మహానాడు వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు తొలివిడత మేనిఫెస్టో ప్రకటించినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్‌ సహా వైకాపా మంత్రులకు నిద్రపట్టడం లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్‌ అమలు చేశారని చెబుతున్న మంత్రులు.. ప్రజలకు చెప్పకుండా ఆయన చేసిన కొన్ని ఘనతలను మర్చిపోయారన్నారు. జనం అడగకుండానే 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు.

‘‘ప్రకృతి సంపదైన ఇసుకను రూ.వేల కోట్లకు అమ్ముకుంటానని జగన్ మేనిఫెస్టోలో చెప్పారా? మద్యపాన నిషేధం అని చెప్పి చీప్ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తానని చెప్పారా? దేశమంతా డిజిటల్ ఇండియా అంటుంటే.. మద్యం, ఇసుక అమ్మకాల్లో నగదు లావాదేవీలు నిర్వహిస్తూ డబ్బును కంటైనర్లలో తీసుకెళ్తున్నారు. అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్‌ని రూ.10లక్షల కోట్ల అప్పుతో అప్పుల ప్రదేశ్‌గా మార్చారు. కాంట్రాక్టర్లకు బకాయిలు పెండింగ్‌లో పెట్టి వారి చావులకు కారణమవుతున్నారు. సీఎం జగన్‌ ఈ నాలుగు ఏళ్లలో సాధించిన ఇలాంటి ఘనతల గురించి కూడా మంత్రులు రాష్ట్ర ప్రజలకు వివరించాలి కదా. ప్రజలను దుర్మార్గంగా వేధించి.. వారిపై పన్నుల మోత మోగిస్తున్నారు. నేను చెప్పిన అంశాల్లో ఒక్కటైనా తప్పు ఉందని మంత్రులు చెప్పగలరా? వైకాపా మంత్రులు మాట్లాడేటప్పుడు వారి భాష అదుపులో ఉంటే మంచిది’’ అని సోమిరెడ్డి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని