Somireddy Chandramohan Reddy: జగన్‌ లాంటి నియంత చేతిలో ఏపీ నలిగిపోవాలని కేటీఆర్‌ ఆశించారేమో: సోమిరెడ్డి

జగన్‌మోహన్‌రెడ్డిలాంటి నియంత చేతిలో ఆంధ్రప్రదేశ్‌ మరో ఐదేళ్లు నలిగిపోవాలని భారాస నాయకత్వం ఆశించిందని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated : 11 Jul 2024 07:11 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: జగన్‌మోహన్‌రెడ్డిలాంటి నియంత చేతిలో ఆంధ్రప్రదేశ్‌ మరో ఐదేళ్లు నలిగిపోవాలని భారాస నాయకత్వం ఆశించిందని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దిల్లీలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు, రాజకీయాలపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల్ని ఎక్స్‌ వేదికగా తప్పుబట్టారు. బీఆర్‌ఎస్‌ పాలనలో తండ్రి ఫాంహౌస్‌కు, కుమారుడు కలెక్షన్‌ హౌస్‌కు పరిమితమయ్యారని కేసీఆర్, కేటీఆర్‌లను పరోక్షంగా విమర్శించారు. ‘తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీదరించినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది.  ఆంధ్రప్రదేశ్‌ నాశనమవాలని కోరుకున్నారు. మా నాయకుడు చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండి’’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని