Somireddy: తిరుమలపై మాట్లాడే అర్హత మీకెక్కడిది?

‘వైకాపా హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఘోరంగా విఫలమైన కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్, తెల్లరాయి, టోల్‌గేట్‌ దందాలతో భారీగా సంపాదించారు.

Published : 09 Jul 2024 05:09 IST

చంద్రబాబును విమర్శించే నైతికత ఉందా?
కాకాణిని నిలదీసిన సోమిరెడ్డి 

మాట్లాడుతున్న చంద్రమోహన్‌రెడ్డి 

ఈనాడు, నెల్లూరు: ‘వైకాపా హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఘోరంగా విఫలమైన కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్, తెల్లరాయి, టోల్‌గేట్‌ దందాలతో భారీగా సంపాదించారు. గతంలో కల్తీ మద్యం కేసుల్లో నుంచి బయటపడేయాలని చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారు. అలాంటి వ్యక్తి నేడు చంద్రబాబునే విమర్శించడం విడ్డూరంగా ఉంద’ని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని తెదేపా కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘నా కుటుంబానికి విదేశాల్లో రూ.వేయి కోట్ల ఆస్తులున్నాయంటూ కాకాణి నకిలీ పత్రాలు సృష్టించారు. కానీ, అతనిపై 7 కేసులున్నాయి. వేటిలోనూ తప్పించుకోలేరు. సుప్రీంకోర్టు ఇచ్చిన కండిషన్‌ బెయిల్‌పై బతుకున్నార’ని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై కాకాణి చేసిన వ్యాఖ్యలను సోమిరెడ్డి ఆక్షేపించారు. ‘తెలంగాణ, ఏపీ గత ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ ఏనాడూ ప్రజల్లోకి రాకుండా ఫాంహౌస్, ప్యాలెస్‌లకు పరిమితమయ్యారు. అందుకు భిన్నంగా చంద్రబాబు సీఎం అయిన నెల రోజుల్లోనే ఒక మెట్టు దిగి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. విభజన సమస్యల పరిష్కారానికి సామరస్యపూర్వకంగా చర్చలు జరిపితే.. కాకాణి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబును రేవంత్‌రెడ్డి తితిదే, ఓడరేవులు, సముద్ర తీరంలో వాటా అడిగారంటూ ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వైకాపా హయాంలో తితిదేను భ్రష్టు పట్టించారని, తిరుమలను అవినీతి క్షేత్రంగా మార్చారని మండిపడ్డారు. ‘ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరుక్కొన్న జగన్‌.. ఐదేళ్లలో కేంద్రాన్ని నిధులపై ప్రశ్నించలేదు. వ్యవసాయ శాఖ పరిధిలో కేంద్రం నుంచి రావాల్సిన 60 శాతం నిధులను కాకాణి వదిలేశారు. బెంగళూరు రేవ్‌ పార్టీ వద్ద దొరికిన కారుపై అతని పేరుతో స్టిక్కర్‌ దొరకడంతో వణికిపోతున్నారు. అలాంటి వ్యక్తి చంద్రబాబుపై ఆరోపణలు చేయడమా?’ అని సోమిరెడ్డి ఆగ్రహించారు.

  • ‘వైకాపా అధికారంలో ఉన్నన్నాళ్లు సాక్షిలో రాసిన కథనాలను ఎవరూ చదవకపోవడంతో ప్రభుత్వ సొమ్ముతో వాలంటీర్లతో పత్రిక కొనిపించి సర్క్యులేషన్‌ పెంచుకునే ప్రయత్నం చేశారు. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ను అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నించారు. అలాంటి వారికి నేడు పత్రికల గురించి మాట్లాడే నైతికత ఉందా’ అని సోమిరెడ్డి నిలదీశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు