Somu Veerraju: ప్రభుత్వ పాలనంటే ట్రేడింగ్‌గా మార్చేశారు: సోము వీర్రాజు

ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తున్నట్లు తమ పార్టీ భావిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

Updated : 16 May 2022 06:45 IST

రాజమహేంద్రవరం: ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తున్నట్లు తమ పార్టీ భావిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మద్యం తయారీ, విక్రయాలతో వైకాపా నాయకులు లాభపడుతున్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. రాష్ట్రంలో మట్టి, ఇసుక, రెడ్‌ గ్రావెల్‌ను విచ్చలవిడిగా దోచేస్తున్నారని.. మంత్రులు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పరిపాలన అంటే ట్రేడింగ్‌గా మార్చారని.. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పాలైందని విమర్శించారు.

రానున్న ఎన్నికల్లో భాజపా-జనసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక పరిపుష్టి చేస్తామని.. ఉద్యోగ నియామకాలు చేపడతామని సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్రంలో మద్యం షాపుల వద్ద ఆన్‌లైన్‌ పేమెంట్‌ లేదని.. దానిపై వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి చేరడం లేదన్నారు. జూన్‌ 5, 6 తేదీల్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తారని ఆయన తెలిపారు. విజయవాడ, రాజమహేంద్రవరంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నడ్డా బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని