AP News: తీరు మార్చుకోకపోతే తాడోపేడో తేల్చుకుంటాం: సోము వీర్రాజు

కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనలో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి అని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలోని

Updated : 11 Jan 2022 15:50 IST

విజయవాడ: కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనలో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి అని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు ఘటన సమయంలో పోలీసులపైనా దాడి జరిగిందని చెప్పారు. భాజపా నేత శ్రీకాంత్‌రెడ్డిని చంపేస్తామంటూ బెదిరించిన ఆడియో తమ దగ్గర ఉందన్నారు. తప్పుడు కేసు పెట్టి ఆయన్ను జైలుకు పంపిస్తారా?వైకాపాకు ప్రజలు అధికారమిచ్చింది అరాచక పాలన చేసేందుకా? అని ఆయన నిలదీశారు. శ్రీకాంత్‌రెడ్డి, భాజపా నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలు పంపిస్తున్నారని.. ఇప్పటికైనా వైకాపా తీరు మార్చుకోకపోతే తాడోపేడో తేల్చుకుంటామన్నారు.

చేతనైతే నిత్యావసరాల ధరలు తగ్గించండి

సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వ ఆలోచనేంటని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇసుక ధరలు ఎందుకు తగ్గించరని నిలదీశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించి గొప్పగా చెప్పుకోవడమేంటని.. చేతనైతే నిత్యావసరాల ధరలు తగ్గించాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనేవాళ్లు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారని.. బియ్యం అక్రమ రవాణాలో వైకాపా నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని