
Madduvalasa Project: భాజపా ‘ప్రాజెక్టు బాట’తో ప్రభుత్వంలో కదలిక: సోము వీర్రాజు
వంగర: భాజపా చేపట్టిన ‘ప్రాజెక్టు బాట’ కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం ‘మడ్డువలస ప్రాజెక్టు’ నిర్వాసిత గ్రామం పట్టువర్ధనంలో ఎమ్మెల్సీ మాధవ్, ఇతర భాజపా నేతలతో పాటు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో చర్చలు జరిపారు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. నిర్వాసితులను పాలకులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు కోసం ఉన్నదంతా ఇచ్చిన వారికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకుండా దీన స్థితికి తీసుకురావడం సరైంది కాదని మండిపడ్డారు. మీడియా పోలవరం మినహా మిగతా ప్రాజెక్టుల సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ‘ప్రాజెక్టు బాట’ వల్ల పలు చోట్ల నిర్వాసితుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని సోము వీర్రాజు తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై భాజపా పోరాడుతుందని చెప్పారు. మడ్డువలస ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు.
మడ్డువలస ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని.. నిర్వాసితుల సమస్యలపైనా దృష్టి సారించాలని కోరారు. పట్టువర్ధనం గ్రామానికి కిలోమీటరు దూరంలో ఇక్కడి ప్రజలకు పునరావాసం కల్పించాలని లేనిపక్షంలో ప్రస్తుత గ్రామంలోనే గృహనిర్మాణాలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు భాజపా వారి వెంటే ఉంటుందని సోము వీర్రాజు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Chiranjeevi: భీమవరం చేరుకున్న చిరంజీవి.. అభిమానుల ఘనస్వాగతం
-
Business News
Stock Market Update: ఊగిసలాటలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Politics News
Raghurama: నా శ్రేయోభిలాషుల కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నా: రఘురామ
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Related-stories News
Amarnath yatra: సైనికుల సాహసం.. 4 గంటల్లోనే వంతెన నిర్మాణం
-
Politics News
Raghurama: ఆ జాబితాలో నా పేరు లేదు.. పర్యటనకు రాలేను: మోదీకి రఘురామ లేఖ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!