Andhra News: పవన్‌ కల్యాణ్‌ వైఖరికి అనుగుణంగానే ఏపీ రాజకీయాలు: సోము వీర్రాజు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైఖరికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.

Updated : 15 Jan 2023 07:19 IST

దేవీచౌక్‌ (రాజమహేంద్రవరం): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైఖరికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని భాజపా జిల్లా కార్యాలయం ఆవరణలో భోగి పండగను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలం యువశక్తి సభలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తెదేపాకు దగ్గరవుతున్నట్లుగా ఉన్నాయని ఓ విలేకరి ప్రస్తావించగా సోము వీర్రాజు స్పందించారు. పవన్‌ మాటలు కొత్తగానే ఉన్నాయని, ఇంకా స్పష్టంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై స్పష్టత వస్తే అందరి కత్తులకు పదునెక్కుతుందని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని