Somu Veerraju: మోదీ సభకు పవన్‌ను ఆహ్వానిస్తారా? మీడియా ప్రశ్నకు సోము వీర్రాజు నో ఆన్సర్‌

ఏపీ రాజధాని అమరావతికే భాజపా కట్టుబడి ఉందని.. ఈ విషయంలో మరో వివాదానికి తావు లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. 

Updated : 07 Nov 2022 15:12 IST

విశాఖ: ఏపీ రాజధాని అమరావతికే భాజపా కట్టుబడి ఉందని.. ఈ విషయంలో మరో వివాదానికి తావు లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న వైకాపాను ప్రశ్నించాలని మీడియా ప్రతినిధులకు ఆయన సూచించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. 

ఈనెల 11న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్న సందర్భంగా పర్యటన వివరాలను ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుతో కలిసి సోము వీర్రాజు వెల్లడించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ప్రధాని పర్యటన వివరాలను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ముందే ప్రకటించారని ఆయన్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై క్రెడిట్‌ కొట్టేసేందుకు వైకాపా ఉబలాటపడుతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని సభకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించగా సోము వీర్రాజు సమాధానం చెప్పలేదు. విశాఖపట్నంలో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని జీవీఎల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు