Andhra Neews: భాజపాతో పొత్తులోనే ఉన్నామని పవన్ చెప్పారు: సోము వీర్రాజు

కొంతకాలంగా రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఇమడలేకే భాజపాను వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా చీరాలలో మీడియాతో మాట్లాడిన సోము.. కన్నా చేసిన వ్యాఖ్యలపై పోము వీర్రాజు స్పంందించారు.

Updated : 17 Feb 2023 17:33 IST

చీరాల: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చాలా కాలం నుంచి చేస్తున్న ఆరోపణలపై గతంలో స్పందించలేదని.. ఇప్పుడు కూడా స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు. భాజపాలో కార్యకర్తగా చేరి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారని.. తానేంటో పార్టీ అధిష్ఠానానికి తెలుసునని సోము అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము మాట్లాడారు. కొంతకాలంగా రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఇమడలేకే భాజపాను వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోము వీర్రాజు రాష్ట్ర బాధ్యతలు చేపట్టాక పార్టీలో వ్యక్తి పెత్తనం ఎక్కువైపోయిందని.. వర్గాలుగా చీలిపోయేలా వ్యవహరించారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

జనసేనతో పొత్తుపై స్పందిస్తూ.. ‘‘విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వారాహికి పూజ సమయంలో భాజపా పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జగన్ వైకాపా ప్రభుత్వానికి 60శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే, అన్ని పథకాలకు తామే నిధులు ఖర్చుపెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం శోచనీయం’’ అని సోము అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు