జగన్‌ అన్నింటిలోనూ అసమర్థుడు: సోము

ఏపీ సీఎం జగన్‌ అన్నింటిలోనూ అసమర్థుడు అని సోమువీర్రాజు విమర్శలు చేశారు. వాలంటీర్లతో ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేయనీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు...

Updated : 14 Apr 2021 12:45 IST

తిరుపతి: ఏపీ సీఎం జగన్‌ అన్నింటిలోనూ అసమర్థుడు అని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శలు చేశారు. వాలంటీర్లతో ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేయనీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా- జనసేన అంటే వైకాపా నాయకులు భయపడుతున్నారన్నారు. భాజపాకు వస్తున్న స్పందన చూసి వైకాపా నేతలకు నిద్రపట్టట్లేదు అని వివరించారు. పవన్‌ కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారని సోము వీర్రాజు అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని