AP NEWS : వనరుల్ని దోచేస్తూ ఖజానా ఖాళీ అయిందంటే ఎలా?: సోము వీర్రాజు

వనరుల సక్రమ వినియోగంతో ఉద్యోగుల పీఆర్సీ సహా ప్రజా సమస్యలూ తీర్చవచ్చని..

Updated : 27 Jan 2022 20:37 IST

విజయవాడ: వనరుల సక్రమ వినియోగంతో ఉద్యోగుల పీఆర్సీ సహా ప్రజా సమస్యలూ తీర్చవచ్చని భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ ఒక్కో జిల్లాను ఒక్కో బంధువుకు అప్పగించేశారని విమర్శించారు. బంధువుల ద్వారా ఇసుక, మట్టి, గనులు సహా అన్నింటినీ లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రకృతి వనరుల్ని దోచేస్తూ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందంటే ఎలా? అని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మట్టిని తవ్వేసుకుని అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై వీర్రాజు స్పందించారు. ‘‘ప్రభుత్వం మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేస్తామంటోంది. ఈ మేరకు జిల్లాల పెంపు విషయంలో ప్రజాభిప్రాయం సేకరించాలి. కమిటీ వేసి ప్రజల కోరికను ప్రభుత్వం తెలుసుకోవాలి’’ అని తెలిపారు. బస్టాండ్‌కు దిక్కులేదంటే.. వైకాపా నేతలు జిల్లాకో విమానాశ్రయం అంటున్నారని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. రోడ్లనే సరిగ్గా వేయలేని ప్రభుత్వం.. జిల్లాకో ఎయిర్‌పోర్టులను పెట్టేస్తారని చెబితే ఎవరైనా నమ్ముతారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు