‘శ్రీవారి సంపదపై రాష్ట్ర ప్రభుత్వం కన్ను’

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే ప్రతి రూపాయి ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.

Updated : 12 Nov 2020 11:26 IST

ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు

తిరుమల: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే ప్రతి రూపాయి ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఇవాళ ఉదయం భాజపా నాయకులతో కలిసి సోము వీర్రాజు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ... శ్రీవారి సంపదపై రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడిందని ఆరోపించారు. సహజ వనరులు, ప్రకృతి సంపదలకు నెలవైన రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేలా రాష్ట్రంలోని పాలకులకు జ్ఞానం ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్టు సోము వీర్రాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని