Congress: జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మరింత ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. అక్టోబరు 6న కర్ణాటకలో నిర్వహించనున్న జోడో యాత్రలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొనబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Published : 02 Oct 2022 22:48 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. అక్టోబరు 6న ఈ యాత్రలో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొనబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పాదయాత్ర కోసం సోమవారమే ఆమె కర్ణాటక చేరుకుంటారు. రెండు రోజుల పాటు పలువురు పార్టీ కీలక నేతలతో విడివిడిగా సమావేశయ్యే అవకాశముంది. అనంతరం అక్టోబరు 6 నుంచి రెండు రోజులపాటు రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో పాల్గొంటున్నట్లు సమాచారం. అక్టోబరు 7న ప్రియాంక గాంధీ కూడా జోడో యాత్రలో చేరే అవకాశముంది.

దేశ ప్రజలను ఏకతాటిపైకి తేవడంతో పాటు దేశంలో భాజపాయేతర శక్తి బలంగా ఉందని చాటిచెప్పడం కోసం రాహుల్‌ గాంధీ సెప్టెంబరు 7 జోడో యాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో సోనియాగాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు. దీంతో తాజాగా ఆమె రాహుల్‌కు మద్దతుగా పాదయాత్రలో పాల్గొనబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌ వరకు జోడో యాత్ర కొనసాగనుంది. 5 నెలల్లో 12 రాష్ట్రాలను కవర్‌ చేసేలా రూట్‌ మ్యాప్‌ను తయారు చేసి అందుకనుగుణంగా ఈ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని