By Election Results: మైన్‌పురిలో డింపుల్‌కు ఆధిక్యం.. ఉపఎన్నికల ఫలితాలు ఇలా..
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు 5 రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఓ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు (By Poll Results) కూడా గురువారం వెలువడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మైన్‌పురి (Mainpuri) లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక(By poll results) ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ (Dimple Yadav) భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. తన సమీప భాజపా అభ్యర్థిపై డింపుల్ దాదాపు 55వేల ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఎస్పీ (Samajwadi Party) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా పిలిచే మైన్‌పురిలో డింపుల్ విజయం ఖాయమేనని పార్టీ శ్రేణులు విశ్వాసంగా ఉన్నారు.
ఇక మైన్‌పురితో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు కూడా నేడు వెలువడుతున్నాయి.
* ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ శాసనసభ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజా ఆధిక్యంలో ఉన్నారు.
* యూపీఓని ఖతౌలీ స్థానంలో ఎస్పీ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి మదన్ భయ్యా ముందంజలో ఉండగా.. భాజపా అభ్యర్థి ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు.
* ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మండి ఆధిక్యంలో ఉన్నారు.
* బిహార్‌లోని కుర్హానీ ఉప ఎన్నిక ఫలితాల్లో భాజపా అభ్యర్థి కేదార్ గుప్తా ముందంజలో కొనసాగుతున్నారు. అధికార జేడీయూ అభ్యర్థి మనోజ్ కుశ్వాహ రెండో స్థానంలో ఉన్నారు.
* ఒడిశాలోని పదంపూర్‌లో బిజు జనతా దళ్ అభ్యర్థి బర్శా సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
* రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ శర్మ ముందంజలో ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన
-
Politics News
Perni Nani: ‘జగన్ పిచ్చి మారాజు’
-
Politics News
Kumaraswamy: దేవేగౌడ తర్వాత నాకు కేసీఆరే స్ఫూర్తి: కుమారస్వామి
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ