- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Samajwadi Party : సమాజ్‌వాది పార్టీ పునర్వ్యవస్థీకరణ
ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవల లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని సమాజ్‌వాదీ పార్టీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. పార్టీకి పెట్టని కోటలు వంటి రామ్‌పూర్, ఆజమ్ఘడ్లలో కూడా ఓటిమి పాలైన విషయం తెలిసిందే. ఎస్పీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ మినహాయించి మిగిలిన పదవులన్నిటినీ రద్దుచేస్తున్నట్లు పార్టీచీఫ్ అఖిలేష్ యాదవ్ ఆదివారం ప్రకటించారు. దీంతో పార్టీ జిల్లా విభాగాలు, అనుబంధ సంస్థల ఎగ్జిక్యూటీవ్ బాడీలు మొత్తం రద్దయ్యాయి. వీటిల్లో యువ, మహిళా విభాగాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ ట్విటర్ హ్యాండిల్లో వెల్లడించారు. ‘‘పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పార్టీ వ్యవస్థీకృతంగా బలపడి భాజపాను పూర్తి శక్తిసామర్థ్యాలతో ఢీకొనడంపై దృష్టిపెట్టింది’’ అని సీనియర్ నాయకుడు ఒకరు తెలియజేశారు.
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలుగా పేరున్న రాంపుర్, ఆజంగఢ్ పార్లమెంటు సీట్లను ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో తన ఖాతాలో వేసుకొంది. రాంపుర్ లోక్‌సభ స్థానంలో అధికార భాజపా అభ్యర్థి ఘనశ్యామ్ లోధీ.. ఎస్పీకి చెందిన మొహమ్మద్ ఆసిమ్ రజాపై విజయం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఖాళీ చేసిన ఆజంగఢ్ స్థానంలోనూ కమలదళాన్నే విజయం వరించింది. అక్కడ ధర్మేంద్ర యాదవ్ (ఎస్పీ)పై దినేశ్‌లాల్ యాదవ్ నిరాహువా (భాజపా) గెలుపొందారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా.. తాజా ఫలితాలతో అందులో భాజపా వాటా 64కు పెరిగింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ZIM vs IND: ఒకే ఏడాది.. భారత్ రెండోసారి 10 వికెట్ల విజయం
-
Politics News
Bandi sanjay: భాజపాతో బలప్రదర్శనకు కేసీఆర్ సిద్ధమా?: బండి సంజయ్
-
India News
Kerala Savari: ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్యాక్సీ సేవలు.. దేశంలోనే మొదటిసారి!
-
India News
Nitin Gadkari: దేశంలో 35% కాలుష్యం పెట్రోల్, డీజిల్ వల్లే..!
-
General News
TTD: 22న అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల: తితిదే
-
Movies News
Social look: తమన్నా మెల్బోర్న్ మెరుపులు.. అల్లరి అనన్య.. కిస్వాల్ వద్ద నయన్జోడీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Thiru review: రివ్యూ: తిరు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Liger: ‘లైగర్’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్ బోర్డ్
- Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్కౌంటర్ చేసిన పోలీసులు