UP Elections: నేరస్థులకు టికెట్లిచ్చి.. నిజస్వరూపం బయటపెట్టింది: యూపీ సీఎం

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా, సమాజ్‌వాదీపార్టీ మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేరస్థులకు టికెట్లు ఇస్తోందని రాష్ట్ర సీఎం, భాజపా నేత యోగి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. తాజాగా ఎస్పీ పార్టీ అభ్యర్థి, కైరానా నియోజక

Published : 17 Jan 2022 18:44 IST

ఎస్పీపై యోగి ఆదిత్యనాథ్‌ విమర్శలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా, సమాజ్‌వాదీపార్టీ మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో నేరస్థులకు సమాజ్‌వాదీ పార్టీ టికెట్లు ఇస్తోందని రాష్ట్ర సీఎం, భాజపా నేత యోగి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. తాజాగా ఎస్పీ పార్టీ అభ్యర్థి, కైరానా నియోజక వర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే నహిద్‌ హసన్‌ నామినేషన్‌ దాఖలుకు వెళ్తుండగా.. పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. గతేడాది గ్యాంగ్‌స్టర్‌ యాక్ట్‌ కింద నమోదైన కేసులో నిందితుడిగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘నేరస్థులకు పార్టీ టికెట్లు ఇవ్వడం ద్వారా సమాజ్‌వాది పార్టీ తన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెట్టింది. తిరిగి భాజపా అధికారంలోకి వస్తే ఈ నేరస్థులపై న్యాయవిచారణ జరిపి వారి భరతం పడతాం’’అని యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు. కాగా.. హసన్‌ అరెస్టుపై స్పందించిన ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌.. అది ఒక విఫలయత్నమన్నారు. అధికార పార్టీ.. తమ పార్టీ నేతలను, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఈ విధంగా దాడులు చేస్తోందని అఖిలేశ్ ఆరోపించారు. యూపీలోని 403 నియోజవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చిన 10న ఫలితాలు వెల్లడవుతాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని