Tammineni: వార్ జోన్‌లో అడుగుపెట్టాం.. కురుక్షేత్రానికి మేం సిద్ధమే: స్పీకర్ తమ్మినేని
రాష్ట్రంలోని బీసీ కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లను నియమిస్తే తెదేపా (TDP) నేతలు హేళన చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ (Tammineni Sitaram) అన్నారు.
విజయవాడ: రాష్ట్రంలోని బీసీ కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లను నియమిస్తే తెదేపా (TDP) నేతలు హేళన చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ (Tammineni Sitaram) అన్నారు. బీసీల ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు ముసుగులు వేస్తూ వస్తున్నారని ఆక్షేపించారు. విజయవాడ (Vijayawada)లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైకాపా (YSRCP) ఆధ్వర్యంలో ‘జయహో బీసీ మహాసభ’ నిర్వహించారు. ఈ సభకు బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ‘‘బీసీల కోసం సీఎం జగన్ (CM Jagan) నేరుగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గత ఐదేళ్లలో బీసీలకు చంద్రబాబు రూ.964 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ మూడేళ్లలోనే జగన్ రూ.90,415 కోట్లు అందించారు. రాబోయే సార్వత్రిక కురుక్షేత్రానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఐకమత్యంగా జగన్ వెంట ఉండి మళ్లీ ఆయన్ను సీఎంను చేస్తేనే ఈ సభకు సార్థకత. మనం వార్ జోన్‌లో అడుగుపెట్టాం. శత్రు సంహారం చేసి జగన్‌ను మళ్లీ సీఎంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని తమ్మినేని సీతారామ్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: శిథిలాల కింద తమ్ముడికి ఏం కాకూడదని.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఏడేళ్ల బాలిక ఫొటో
-
General News
Amaravati: విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని నోటిఫై చేశారు: తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
Amigos: ఆ పాట చూశాక అందరూ షాక్ అవుతారు: కల్యాణ్ రామ్
-
India News
Subramanian Swamy: అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి.. వేలం వేయాలి..!
-
Sports News
IND vs AUS: తొలి టెస్టు కోసం దినేశ్ కార్తిక్ ప్లేయింగ్ XI ఇదే!.. గిల్, కుల్దీప్కు దక్కని చోటు
-
Politics News
Mekapati Chandrasekhar Reddy: వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత