TDP: లోక్‌సభలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు

తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీనేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు ఖరారైనట్టు సమాచారం.

Updated : 22 Jun 2024 21:56 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీనేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లగా దగ్గుమల్ల ప్రసాద్ రావు, బైరెడ్డి శబరిలను నియమించారు. కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, పార్లమెంటరీ పార్టీ విప్‌గా గంటి హరీష్‌లను ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో తెదేపా పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశమైంది. సమావేశానికి తెలుగుదేశం ఎంపీలు, సీనియర్ నేతలు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ ఉన్నారు. దీంతో లోక్‌సభలో పార్టీ నేతగా శ్రీకృష్ణదేవరాయలును ఎంపిక చేశారు. ఈసారి లోక్ సభలో తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీల బలం ఉంది. ఈ నెల 24నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు సాధించేలా ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని