Andhra News: ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం

ఏపీ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది.

Updated : 16 Jun 2024 13:52 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం కోసం ఆమె ఫైల్‌ తెచ్చారు. అయితే, సంతకం పెట్టేందుకు నిరాకరించిన మంత్రి.. ఆ దస్త్రాన్ని తిప్పి పంపారు. ఇప్పుడు సమయం కాదంటూ తిరస్కరించారు. మరోవైపు.. రెండు రోజుల క్రితం శ్రీలక్ష్మిని సీఎం చంద్రబాబు తన షేషీ నుంచి బయటకు పంపారు. ఆమె నుంచి పుష్పగుచ్ఛం తీసుకోకుండా నిరాకరించారు. జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు