Mamata: ‘రాబోయే రోజుల్లో ఉద్యోగులకు రాష్ట్రాలు జీతాలివ్వలేకపోవచ్చు’

దేశంలో ఇంధనం, నిత్యావసరాల ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నా కేంద్రం ఏమీ చేయడంలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు......

Published : 08 Apr 2022 01:49 IST

కోల్‌కతా: దేశంలో ఇంధనం, నిత్యావసరాల ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నా వాటి నియంత్రణకు కేంద్రం ఏమీ చేయడంలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. పెరిగిపోతున్న ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్న దీదీ.. రాబోయే రోజుల్లో రాష్ట్రాలు తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోవచ్చేమోనని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిల్ని కేంద్రం వెంటనే చెల్లించాలని కోరారు. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధించేందుకు సీబీఐ, ఈడీలను ఉపయోగించడానికి బదులుగా ధరలు తగ్గించే మార్గమేంటో చూడాలంటూ ఆమె వ్యంగ్య బాణం విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని