సువేందు అధికారి కాన్వాయ్‌పై రాళ్లదాడి

పశ్చిమ్‌ బెంగాల్‌లోని సొంత నియోజకవర్గం నందిగ్రామ్‌లో పోలింగ్ జరుగుతోన్న వేళ.. భాజపా నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై గురువారం రాళ్లదాడి జరిగింది.

Published : 01 Apr 2021 14:58 IST

సురక్షితంగా బయటపడిన భాజపా నేత

కోల్‌కతా: పశ్చిమ్‌ బెంగాల్‌లోని సొంత నియోజకవర్గం నందిగ్రామ్‌లో పోలింగ్ జరుగుతోన్న వేళ.. భాజపా నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై గురువారం రాళ్లదాడి జరిగింది. అయితే, ఆ దాడి నుంచి సువేందు సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. నందిగ్రామ్‌లోని సాతేన్‌గాబరీ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాళ్ల దాడిలో సువేందు కారు వెనక వస్తోన్న మీడియా వాహనం మాత్రం స్వల్పంగా ధ్వంసమైందని వెల్లడవుతోంది. 

అలాగే, పశ్చిమ మిడ్నాపూర్‌లోని కేశ్‌పూర్‌ భాజపా అభ్యర్థి ప్రీతి రంజన్‌ కాన్వాయ్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం రెండో దశలో భాగంగా బెంగాల్‌లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. సువేందు, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న నందిగ్రామ్ కూడా ఆ స్థానాల్లో ఒకటి. ఇదిలా ఉండగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 58 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

భాజపా కార్యకర్త మృతి:
నందిగ్రామ్‌లో ఓ భాజపా కార్యకర్త గురువారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకొని మరణించినట్లు పోలీసులు గుర్తించారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడి పేరు ఉదయ్‌ దుబేగా పోలీసులు చెప్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని