
AP News: ఏపీ మంత్రి సురేశ్‌ను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
విజయవాడ: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం ఘటనపై విజయవాడ అర్‌అండ్‌బీ భవనంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన మంత్రి సురేశ్‌ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అనంతపురం లాఠీఛార్జి ఘటనపై విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రైవేటు యాజమాన్యాలు అధిక ఫీజు వసూలు చేస్తే పేదలు ఎలా భరిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు విద్యార్థులు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో టీచర్లను కొనసాగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నిన్న అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఎయిడెడ్ సంస్థలపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రితో మాట్లాడుతుండగానే విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.