దళితుల ప్రాణాలంటే వైకాపాకు లెక్కలేదు... చంద్రబాబును కలిసిన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు

వైకాపా పాలకులకు దళితుల ప్రాణాలంటే లెక్కలేదని ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం కన్నీటి

Updated : 24 Jun 2022 16:42 IST

అమరావతి: వైకాపా పాలకులకు దళితుల ప్రాణాలంటే లెక్కలేదని ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జరిపించే విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబుని కలిసిన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు... ఎమ్మెల్సీ అనంతబాబు తమ కుమారుడిని అన్యాయంగా చంపేశాడని బోరున విలపించారు. తమ కుమారుడి హత్య కేసులో పోలీసుల ద్వారా న్యాయం జరగలేదని వాపోయారు. నిందితుడు అనంతబాబుని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపించాలనే తమ డిమాండ్‌ను పట్టించుకోవట్లేదన్నారు. రూ.5లక్షలు ఆర్థిక సాయం చేయటంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. సీబీఐ విచారణ జరిపించేలా తనవంతు ఒత్తిడి తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని